ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. ఇలా త్రిపాఠి

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరు నాగారం తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి, మండల పరిధిలో నమోదైన ఓటరు జాబితాను, ఎలక్షన్ సంబంధించిన ఫామ్ 6,7,8 లను (ఓటరు నమోదు, సవరణ, తొలగింపు)
ప్రాసెస్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్తవహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఏవైన అవసరమైతే సమకూర్చాలని తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ వీరాస్వామి, డిప్యూటీ తహశీల్దార్ నితిష్ కుమార్, ఆర్ ఐ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.