ఏట్ట‌కేల‌కు కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

సికింద్రాబాద్‌: కాచిగూడ, కరీంనగర్‌ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్‌, మోర్తాడ్‌, మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కణ్నుంచి మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి.. కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.