ఏడుకు చేరిన ఖమ్మం మృతుల సంఖ్య
ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మాయి గూడెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి వరంగల్ వెలుతున్న లారీ ఎదురుగా ఖమ్మం వైపు వస్తున్న ఆటోను ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా వస్తూ ఆటోను ఢీ కోట్టాడు. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.