ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

johxn78h
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఈరోజు స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌ బ్లాక్‌లోని రెండో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సచివాలయంలోని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.