ఏప్రిల్ ఒకటిన లెఫ్ట్ పార్టీల నిరసన దీక్షలు
ఖమ్మం గాంధీచౌక్: విద్యుత్తుఛార్జీల పెంపు, కోతలు నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో పది వామపక్షాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఏప్రిల్ ఒకటిన జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయాలని సీపీఎం , సీపీఐ న్యూడెమొక్రసీల ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. గురువారం ఖమ్మం సుందరయ్య భవనంలో మూడు పార్టీల నాయకుల సమావేశం జరిగింది. 9న జరిగే రాష్ట్ర బంద్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పాల్గొన్నారు.