ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 98 శాతం ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ జి వేంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అధిక వర్షపాతం వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగినప్పట్టికి 01 ఏప్రిల్ నుంచి 31 ఆగష్టు వరకు నాలుగు నెలల కాలంలో ప్రోగ్రెస్సివ్ ఉత్పత్తి 98 శాతం సాధించాము.
2022ఆగష్టు నెలలోనే మిణుగూరు ఏరియా సాధించిన మాసిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 836400 టన్నులు కాగా 755001 టన్నులు అనగా 90 శాతం ఉత్పత్తి సాధించడం జరిగింది. ఓ బి వెలికితీత లక్ష్యం 12 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా 8.28 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 69 శాతం చేశారు.రైల్వే ర్యాక్స్ ద్వారా బొగ్గు రవాణా 100 ర్యాక్స్ పంపడం జరిగింది ఆగష్టు నెలలో రైల్వే, రోడ్ అండ్ రోప్ వే ద్వారా జరిగిన మొత్తం రవాణా 7 లక్షల 45 వేల 438 టన్నులు బొగ్గు రవాణా చేశాము. పదివి విరమణ, మెడికల్ ఉద్యోగులకు ఈ క్రింది విధంగా చెల్లింపులు జరిగాయి.సీఎం పిఎఫ్ అండ్ పెన్షన్ ఒకటి ,గ్రాడ్యుటి14, జిఐఎస్ 3,ఎఫ్ బి ఐ ఎస్ 28,ఎల్ ఎస్ ఆర్ 25 లాక్స్ 1, హెచ్ బి ఎల్ ఆర్ ఎస్ 50 సి పి ఆర్ ఎంస్ కార్డ్స్ 19, కోవిడ్ ఎక్స్ గ్రేసియా 1,కాంపెన్సేస్సి వ్ ఎంప్లాయిమెంట్13 పై వివరాలను తెలిపారు. సింగరేణి మణుగూరు ఏరియాలో ఉన్న ప్రత్యేక స్థానాన్ని దృష్టిలో ఉంచుకొని యంత్రాల పని గంటలు 14 గంటల నుంచి 18 గంటల వరకు పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్ లోడింగ్ కార్మికులకు ధీటుగా సింగరేణి ఉద్యోగులు పని చేసినట్లైతే అధికోత్పత్తి సాధించి లాభాలను పొందవచ్చు. ఆ లాబాలు ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకి ఎంతగానే ఉపయోగపడుతాయి. ఇప్పటికి కోల్ ఇండియా కంటే సింగరేణి యాజమాన్యం ఎన్నో అదనపు సంక్షేమ కార్యక్రమాలు చేబడుతోంది. సింగరేణి ఉద్యోగులు అధికారులు, యూనియన్ నాయకులతో కలిసి సమిష్టిగా పని చేసి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తద్వారా ప్రత్యేకంగా అనేక మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాల్లో రావడంతో పాటు లక్షలాదిమందికి ఉపాది అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ పాత్రికేయులను పరిచయం చేసుకున్నారు. తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం లలిత్ కుమార్ , పీకేఓసి పిఓ లక్ష్మీపతి గౌడ్ , ఎం ఎన్ జి ఓసి పి ఓ శ్రీనివాసా చారి, డిజిఎం(ఐఈడి) జి వెంకట్ రావు , డిజి.ఎం(పర్సనల్) ఎస్ రమేష్, రాజేంద్ర ప్రసాద్ , ఫీనాన్స్ మేనేజర్ అనురాధ . మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.