ఏయిడ్స్‌, క్యాన్సర్‌ మందుతో మాయం

మూలకణాల మార్పిడి ద్వారా హెచ్‌ఐవి నుంచి ఇద్దరికి విముక్తి
లండన్‌: కేన్సర్‌కు మందు ఇస్తే ఎయిడ్స్‌ వ్యాధి నయమైన విచిత్ర సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో జరిగింది. ఏయిడ్స్‌ బారిని పడిన ఇద్దరు వ్యక్తులు చాలాకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లింఫోమా అనే రక్త కేన్సర్‌ బయటపడడంతో మూలకణా మార్పిడి చికిత్స జరిపారు. కొద్ది రోజుల తర్వాత కేన్సర్‌ నయమవడమే కాక, ఏయిడ్స్‌ వ్యాధి నుంచి వారు విముక్తి పొందినట్లు తెలిసింది. ఈ వివరాలు కౌలలంపూర్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ ఏయిడ్స్‌ సొసైటీ సమావేశంలో బోస్టన్‌లో ఇహార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, బ్రిగమ్‌ అండ్‌ బిమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన తిమోతి హెన్రిచ్‌ వెల్లడించారు. బాధితుల నుంచి ఏయిడ్స్‌ వైరస్‌ పూర్తిగా వెళ్లిపోయిందా అన్న విషయాన్ని ఇప్పుడే చేప్పలేమన్నారు. ఏయిడ్స్‌ నిర్మూలనకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇదో మైలురాయని భావిస్తున్నారు. అయితే వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఔషధాల కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.