ఏరియా హాస్పిటల్ లో డాక్టర్ల కొరతను తీర్చాలి

23 నెలల ఏరియర్స్ ని వెంటనే ప్రకటించాలి -ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఎండి అక్బర్ అలీ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మందమర్రి ఏరియా ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ లో ద్వార సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ ప్రధాన కార్య దర్శి వీ.సీతారామయ్య, కేంద్ర కార్య దర్శి యం డీ. అక్బర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ లోని సమస్యలు పరిష్కరించాలని, కొత్తగా వచ్చిన వార్డ్ అసిస్టెంట్ ల ఇంక్రిమెంట్, ప్లేడేల సమస్య, సిబ్బంది కొరత, డాక్టర్ ల కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు.ఈ తరుణంలో రోగుల వార్డులలోని ఏ సి. లు పనిచేయడం లేదని నాయకులకు రోగులు పిర్యాదు చేశారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం జీ యం. అఫీసుల ముందు 11 వ,వేజ్ బోర్డు 23 నెలల ఏరియార్స్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2222 కోట్లు లాభాలు వచ్చాయని ప్రకటించిన యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అనంతరం ఇటివల ఎన్నుకో బడిన కమిటీని ఏ సి యం ఓ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్య దర్శి ఏ. ఆంజనేయులు, పిట్ ఉపాధ్యక్షరాలు జీ. సుజాత సిస్టర్, పిట్ కార్యదర్శి నాగేంద్ర బట్టు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు