ఏరువాకతో రైతుల్లో ఆనందం

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తొలకరితో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. కందిపంట సాధారణ సాగువిస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలకు కాగా, గతేడాది రికార్డుస్థాయిలో లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దిగుబడి పెరుగడం, కంది ధర తగ్గడంతో రైతులు ఈసారి కందిసాగుపై ఆసక్తి చూపకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. కందిసాగు విస్తీర్ణం పెరగవచ్చని అంచనావేస్తున్నారు. సకాలంలో చినుకులు పలుకరించడంతో పొలం పనులు ఊపందుకున్నాయి. యాసంగి ధాన్యం అమ్ముకున్న రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించడంతో రైతులకు భరోసా కలిగి,పెట్టుబడులకు ధీమా వచ్చిందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్నంతటినీ కొనుగోలు చేయాలని సిఎం సూచించారు. యాసంగి ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు సకాలంలో చేతికందుతుండడంతో వానాకాలం పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రైతులు ధీమాగా ఉన్నారు. దీనికితోడు పెట్టుబడి పథకం కింద ఎకరాకు 4వేలు అందాయి.