ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్
ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఏసీబీకి రెండ్ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ జనార్థన్ బృందానికి దొరికిపోయాడు. అతన్ని బుధవారం కోర్టులో హజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.