ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

బోనకల్‌, జనంసాక్షి : ఖమ్మం బోనకల్‌ మండలంలోని రావినూతల గ్రామంలో తాళ్లూరి రామకృష్ట అనే రైతు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పాషా రూ. 30వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు పాషాను అదుపులోకి తీసుకున్నారు.