ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డికి ఘనంగా బదిలీ వీడ్కొలు

కరీంనగర్‌, జూలై 27 (జనంసాక్షి) :  అవినీతి నిరోధక శాఖలో కరీంనగర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఏసీబీలో ఇన్స్‌స్పెక్టర్‌గా పని చేసిన అంజిరెడ్డి అనతికాలంలో ప్రజల మన్ననలు పొందారని ఆయన  బదిలీపై వెళ్లడం కొంత బాధించిన సమర్థవంతంగా ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని పలువురు కొనియాడారు. మిగిలిన సర్వీసులో ఆయన తనదైన శైలీలో పని చేసి ప్రజల మన్ననలు పొంది ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని   వక్తలు కొనియాడారు. వివిధ హోదాల్లో, పదొన్నతిలో తిరిగి కరీంనగర్‌కు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్‌స్పెక్టర్‌ రమణమూర్తి, పలువురు సిబ్బంది అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు.