ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

vlcsnap-2016-08-08-16h17m07s187కరీంనగర్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ వీఆర్ వో గౌస్ పాషా… శ్రీనివాస్ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. శ్రీనివాస్ కు చెందిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం గౌస్ 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో, శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వల పన్ని గౌస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.