ఏసీబీ వలలో వేములవాడ మున్సిపల్ కమిషనర్
రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు.
వేములవాడ అక్టోబర్ 18 (జనంసాక్షి)
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వంలో దాడులు నిర్వహించి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావును పట్టుకున్నారు.
చామకుంటలో నిర్మిస్తున్న వెజిటేబుల్ మార్కెట్ బిల్డింగ్ నిర్మాణ వర్క్ కాంట్రాక్ట్ పొడిగించే విషయంలో కాంట్రాక్టర్ ను కమిషనర్ డబ్బులు డిమాండ్ చేయగా .. సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
కాంట్రాక్టర్ నుండి కమీషనర్ రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్టులు పూర్తిచేసి కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.