ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం చిత్రం నిలపాలి
ఖమ్మం, అక్టోబర్ 25 : బ్రాహ్మణులను కించపరిచేలా రూపొందించిన ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం చిత్రం విడుదలను నిలిపివేయాలని ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ బ్రాహ్మణ జాగృతి మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ పంతంగి కమలాకరశర్మ, సెక్రటరీ విఎస్ రావు ఒక ప్రకటనలో కోరారు. చిత్ర దర్శక, నిర్మాతలు బేషరత్తుగా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, చిత్రం విడుదలకు అనుమతించిన సెన్సార్‌బోర్డు సభ్యులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.