ఐఎస్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధం!

సింగపూర్: ఐఎస్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సింగపూర్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందుకోసం కొత్తగా సైనికులును నియమించనుందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఎన్ జీ ఇంగ్ హెన్ వెల్లడించారు. నియమితులైన సైనికులను కువైట్, ఖతార్లకు తరలించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరి పోతున్నాయని హెన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిర్మూలించేందుకు ప్రతి నగరంలో అణువణువు రక్షణ కల్పించడం ఏ రక్షణ వ్యవస్థకైనా సాధ్యం కాదని అన్నారు.

ఏలాంటి ఉగ్రవాద చర్యలనైనా ఎదుర్కొనేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని సింగపూర్ ప్రజలను పిలుపునిచ్చారు. ఇతర దేశాల నుంచి బలగాలను రప్పించడంపై స్పందన తెలపాలని విలేకర్లు ప్రశ్నించగా… దేశంలో ఇకపై దాడులు జరగవని గ్యారెంటీ లేదని చెప్పలేమని హెన్ చెప్పారు. ఉగ్రవాద నిరోధానికి సింగపూర్ ప్రభుత్వం ముందస్తు సర్వే టీంను నియమించి…వారిని వైమానికి దళానికి అనుసంధానం చేయాలనుకుంటున్నట్లు హెన్ తెలిపారు.