ఐఏఎస్ రవి కేసు….. సీఐడితో దర్యాప్తు… సీఎం సిద్దరామయ్య

బెంగళూరు: అనుమానస్పదస్థితిలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు సీఐడితో చేయిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం శాసన సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఐఏఎస్ అధికారి రవి అనుమానస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగంగా చెప్పిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంలో కర్ణాటక హొం శాఖ మంత్రి జార్జ్ మాట్లాడుతూ వ్యక్తి గత కారణాల వలన రవి మరణించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ప్రతిపక్షాలకు సమాదానం ఇచ్చారు. ఐఏఎస్ రవి కేసు….. సీఐడితో దర్యాప్తు… సీఎం సిద్దరామయ్య తరువాత ఐఏఎస్ అధికారి రవి కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో చేయిస్తున్నామని, సీఐడికి కేసు అప్పగించాలా, వద్దా అని చర్చిస్తున్నామని అన్నారు. ఆ సందర్బంలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. హొం శాఖ మంత్రి జార్జ్ బాధ్యత లేకుండ మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ సందర్బంలో గందరగోళం ఎర్పడింది. అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చెయ్యడంతో సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారి రవి నిజాయితిగా పని చేశారని కితాబు ఇచ్చారు. రవి కేసు దర్యాప్తు సీఐడికి అప్పగిస్తున్నామని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పట్టబుడుతున్నాయి. గందరగోళం మద్యలో సభను వాయిదా వేశారు.