ఐఐటిల్లో టీచింగ్ స్టాఫ్ కొరత
మసకబారుతున్న వాటి ప్రతిభ
23 ఐఐటిల్లో 4596 టీంచింగ్ పోస్టులు ఖాళీ
వివరాలు వెల్లడిరచిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్
న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో టీచింగ్ పోస్టులు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యుత్తమ విద్యనందించి ఎంతోమందిని ఉన్నంతంగా తీర్చిదిద్దాల్సిన విద్యాసౌధాలు.. అధ్యాపకుల లేమితో క్రమంగా మసకబారుతున్నాయి. టీచింగ్ పోస్టులు ఖాళీ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం లేదు. దీంతో దేశంలోని మొత్తం 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీల్లో 4596 టీంచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో ప్రకటించింది. అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 798 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఇక ముంబై ఐఐటీలో 517, దేశంలోని టాప్ విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్‌లో కూడా 482 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీ ఢల్లీిలో 52, ఐఐటీ ధన్‌బాద్, రూర్కీ, కాన్పూర్, గువాహటిలో 300లకుపైగా టీచింగ్ పొజిషన్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇక కొత్తగా ఏర్పాటుచేసిన తిరుపతి ఐఐటీలో 15, పాలక్కాడ్ ఐఐటీలో 27 చొప్పున ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడిరచారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బీజేపీ సర్కార్ వెల్లడిరచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్`ఏ, 1,18,801 గ్రూప్`బీ, 8,36,936 గ్రూప్`సీ పోస్టులు ఉన్నాయని వెల్లడిరచారు.