ఐఐటీ సీటు సాధించిన విద్యార్థి నరసింహ కి ఘన సన్మానం

మట్టిలో మాణిక్యం పేదింటి బిడ్డ పెద్ద చదువు

కురవి అక్టోబర్-22

(జనం సాక్షి న్యూస్)

కురవి మండలం కాకులబోడు తండా గ్రామపంచాయతీ కి చెందిన గుగులోతు నర్సింహా అను విద్యార్థి ఐఐటీ రూర్కీ లో సీటు సాధించిన శుభ సందర్భంగా అతను చదివిన పాఠశాల నేరడ జడ్పీహెచ్ఎస్ లో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కురవి ఎంపీపీ గుగులోతు పద్మావతి, డీఈవో అబ్దుల్ హై లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ తండాకు,గ్రామానికి,మండలానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన నర్సింహా ఐఐటీ సీటు సాధించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. నర్సింహా ఆలోచనను మిగిలిన విద్యార్థులు స్ఫూర్తి గా తీసుకోవాలని కోరారు. నేరడ జడ్పీహెచ్ఎస్ ఉపాద్యాయులను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో నేరడ గ్రామ సర్పంచ్ గుండోజు శ్రీనివాస్, ఏసిజి  శ్రీరాములు,మోక్షగుండం వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ షేక్ జానీ, బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,ప్రముఖ న్యాయవాది యాదగిరి,ఎస్ఎంసి చైర్మన్ కలకోట వెంకటరమణ, వార్డుమెంబర్ మట్టి ఉపేందర్, పాఠశాల ప్రధానుపాధ్యాయులు సాయిలు,ధరనిపుత్ర చైర్మన్ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు,ఉపాద్యాయులు,విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.