ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి కసరత్తు
ఖమ్మం, అక్టోబర్ 19: ఖరీఫ్ సీజన్‌లో రైతులనుండి ధాన్యం సేకరణకు జిల్లా ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ పంట నూర్పిళ్ళు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులుఈ నెల 26నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఐకెపి ద్వారా 42మండలాల్లో 67 కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఈ సంవత్సరం జిల్లాలోని 46మండల్లాల్లో 74కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లా నుంచి 4,30వేల క్వింటాళ్లా ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొదటి రకం ధాన్యానికే 1250రూపాయల మద్దతు ధర చెల్లించేలా నిర్ణయించినట్టు సమాచారం.