మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ పూర్తిపేరు ఇంద్రకరణ్‌ గుజ్రాల్‌ రష్యాలో భారత రాయభారీగా పనిచేసిన గుజ్రాల్‌, స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1980లో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో గుజ్రాల్‌ చేరారు. ఇందిరా కేబీనేట్‌లో మంత్రిగా పనిచేశారు.వీపీసింగ్‌ , ఎమర్జెన్సీ సమయంలో, మంత్రిగా పనిచేశారు. సంవత్సరంపాటు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కొద్ది రోజులుగా ఆయన శ్వాస సంబంధిత వ్యాదితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే.