ఐక్యరాజసమితికి ప్రధాని శుభాకాంక్షలు

4

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జనంసాక్షి):

ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో భారత్‌ ముందుంటుందని, ఇకముందు కూడా పూర్తి సహకారం అందింస్తుందని మోదీ తెలిపారు. ఇదిలావుంటే సంగీత్‌ నాటక్‌ అకాడవిూ ప్రతినిధులు శనివారం దేశరాజధాని దిల్లీలోని ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. సంగీతం, నాటకం, నృత్యం తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి సంగీత్‌ నాటక్‌ అకాడవిూ అవార్డులను అందజేస్తారు. బిర్జు మహరాజ్‌, విశ్వమోహన్‌ భట్‌, అజోయ్‌ చక్రవర్తి, అరుణా సాయిరాం, అతుల్‌ తివారి, తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల విూదుగా 2014 సంగీత్‌ నాటక్‌ అకాడవిూ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.