ఐటీలో నవశకం

C

– అడ్డంకులులేని అభివృద్ధి

– నూతన ఐటీ విధానాన్ని ప్రకటించిన సీీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): సింగిల్‌ విండో ఆఫ్‌ తెలంగాణ వితౌట్‌ గ్రిల్స్‌ ఇదే తమ నినాదం అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా పరిశ్రమలకు అనుమతిస్తున్నామని అన్నారు. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఐటీ రంగానికి తెలంగాణ అనుకూల ప్రాంతమని పేర్కొన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు స్వాగతం పలికామని తెలిపారు. ఇప్పటి వరకు అవినీతికి తావులేకుండా సింగిల్‌ విండో ద్వారా 1691 పరిశ్రమలకు అనుమతినిచ్చామని పేర్కొన్నారు. వాటిలో 803 పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. రు.తెలంగాణ ఐటీ రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.1691 సంస్థలకు అనుమతులు ఇచ్చిన తెలంగాణ సింగిల్‌ విండో విధానం అత్యుత్తమైందిగా నిలిచిందన్నారు. ఈ సంస్థలకు కేవలం 15 రోజుల్లో అనుమతులు ఇచ్చామన్నారు. వీటిల్లో అవినీతికి తావులేదన్నారు. తెలంగాణలోని వాతావరణం, ప్రజలు, విధానాలు వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయన్నారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆయన వ్యాపార వేత్తలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుకున్న పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే పదిహేను రోజుల్లోనే అనుమతులిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 20 నెలలే అయిందని పేర్కొన్నారు. సరిగ్గా యేడాది క్రితం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించామని వెల్లడించారు. మాతో కలిసిరండి, అందరం కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి గొప్ప విషయాలు చెప్పారని తెలిపా

అభినందనీయం: గవర్నర్‌

తెలంగాణలో ఐటీతో గ్రావిూణ ప్రాంతాలను అనుసంధానించడం హర్షించే విషయమని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఆయన ఈ సందర్భంగా కేటీఆర్‌ను అభినందించారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వంతో చేతలు కలపాలని ఆయన పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.  అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీ చాలా ముఖ్యమని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.ఐటీ విధానాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు. రూరల్‌ ఐటీ పాలసీ తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. టెక్నాలజీ గ్రావిూణ ప్రాంతాలకు ఉపయోగపడాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.  ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా నిలుస్తోందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ పాలసీని ప్రకటించిన సందర్భంగా

ఆయన ప్రసంగించారు. గ్రావిూణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీ ఉందని తెలిపారు. ఐటీ పాలసీతోపాటు మరో నాలుగు సబ్‌ పాలసీలు కూడా ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్నోవేషన్‌, గేమింగ్‌-యానిమేషన్‌, ఎలక్టాన్రిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, రూరల్‌ టెక్నాలజీ పాలసీలను ఆవిష్కరిస్తున్నామని వివరించారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ గత 25 ఏళ్లుగా రెండో స్థానంలో ఉందని, త్వరలో తెలంగాణను నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాధనలో అందరం భాగస్వాములం కావాలని నాస్కాం ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. డిజిటల్‌ తెలంగాణ కోసం మూడేళ్లలో రూ.10 కోట్లు ఖర్చు పెడతామని వెళ్లడించారు. రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రాలకు రెండు గంటల్లో చేరుకునేలా అద్బుతమైన రవాణా వ్యవస్థ ఉందని శ్లాఘించారు. గతేడాది హైదరాబాద్‌లో రూ.68 వేల కోట్ల ఐటీ ఉత్తత్తి జరిగిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఈ నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.