ఐదుగురి నిందితుల అరెస్టు

కర్నూలు, ఆగస్టు 2 : కర్నూలు నగరంలో ఇటీవల జరిగిన హత్య కేసులో ఐదుగురి నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన నిందితులను చూపించారు. గత నెల 27న జరిగిన ఇద్దరి హత్య కేసులో ఎరుకల శేఖర్‌, విజయ్‌, నర్సింహులు, నాగరాజు, బోయపరుశరాం, గొల్లేశ్వర్‌రాం అనే వ్యక్తులను అరెస్టు చేశామని, వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. నిందితులను నుంచి హత్యకు ఉపయోగించిన కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

తాజావార్తలు