ఐదు మ్యాచ్‌ల విజయంతో ముందున్న కివీస్‌

300 వికెట్ల క్లబ్‌లో కెప్టెన్‌ వెటీరీ
కైస్ట్ర్‌ చర్చ,మార్చి9(జ‌నంసాక్షి): ప్రపంచ కప్‌ సీరిస్‌లో అన్ని మ్యాచ్‌లు గెల్చి అగ్రపథాన దూసుకుని వెళుతున్న  కివీస్‌ స్పిన్నర్‌ డానియల్‌ వెటోరి వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ బౌలర్‌ అతడే. మొత్తంగా 12వ బౌలర్‌ కావడం విశేషం.  298 వికెట్లతో మ్యాచ్‌లో బరిలోకి దిగిన వెటోరి..నాలుగు వికెట్లతో 302కు చేరుకున్నాడు. నవ్‌రోజ్‌ మంగల్‌ వికెట్‌ను అతడు 300వ వికెట్‌గా తీసుకున్నాడు. వన్డేల్లో మురళీధరన్‌ (534), వసీమ్‌ అక్రమ్‌ (502) మాత్రమే 500 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. ఇకపోతే ఇందులో న్యూజిలాండ్‌కు ఎదురేలేకుండా పోయింది. ఐదుకు ఐదూ గెలిచి ప్రపంచకప్‌ గ్రూప్‌-ఏలో అజేయంగా కొనసాగుతోంది. జోరు కొనసాగించిన కివీస్‌ ఆదివారం అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పసికూన అఫ్ఘనిస్థాన్‌ను మట్టికరిపించింది. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 36.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. వెటోరికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఎ/-గానిస్థాన్‌ నిజానికి ఆమాత్రం స్కోరు చేసేలా కూడా కనపడలేదు. వెటోరి స్పిన్‌ మాయాజాలానికి విలవిల్లాడిన ఆ జట్టు ఓ దశలో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ షెన్వారి (54; 110 బంతుల్లో 5?4, 1?6), నజిబుల్లా జద్రాన్‌ (56; 56 బంతుల్లో 8?4, 2?6) ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించి అఎ/-గాన్‌ను ఆదుకున్నారు. లద్కదనలో మెక్‌కలమ్‌ మెరుపు ఆరంభంతో కివీస్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఆరో ఓవర్లో మెక్‌కలమ్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 53. ఆ తర్వాత గప్తిల్‌.. విలియమ్సన్‌తో రెండో వికెట్‌కు 58, టేలర్‌ (24 నా/-బట్‌; 41 బంతుల్లో 2?4)తో మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించి నిష్కమ్రించాడు. ఇలియట్‌ (19), అండర్సన్‌ (7 నా/-బట్‌)లతో కలిసి టేలర్‌ పని పూర్తి చేశాడు.