ఐదు రాష్టాల్ర ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం
కాంగ్రెస్‌తోనే ఎపి సమస్యలకు పరిష్కారం: గిడుగు
అమరావతిఫిబ్రవరి25( జనం సాక్షి): బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అస్తవ్యస్త విధానాలతో దేశాన్ని నాశనం చేసిందని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక విధానాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అన్నారు. దేశంలో ధరలు పెరుగుదల, నిరుద్యోగం
ఆందోళనకరంగా ఉందన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…మతం పేరుతో రాజకీయం చేస్తూ వివాదాలు సృష్టించిందని ఆరోపించారు. ఐదు రాష్టాల్ల్రో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు రిఫరెండమ్‌గా భావిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం త్వరలోనే దేశ ప్రజలు చూడబోతున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా మతతత్వ శక్తుల పాలనను చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని గుర్తించారని గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పాలనపై మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయిన అన్నారు. ఇకపోతే ఎపికి కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు. విభజన హావిూల అమల్లో బిజెపి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.