ఐదు సీట్లు మనమే గెలుస్తాం
కొత్త విద్యుత్ ప్లాంట్లకు ఆమోదం
కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
హైదరాబాద్, మే26(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనమండలి ఎన్నికలఅంశం సమావేశంలో చర్చకు వచ్చింది. తెరాస ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం
చేసుకుంటుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 29న తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాల్లో ప్రదానంగా రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. బీహెచ్‌ఈఎల్‌తో చేసుకున్న ఒప్పందాలను ఆమోదించింది. భూ కబ్జా నివారణ చట్టం సవరణలు రాష్ట్రానికి అన్వయిస్తూ నిర్ణయించారు. గృహ నిర్మాణ విధానానికి ఆమోదం తెలపఞడమే కాక ఓపెన్ బిడ్డింగ్ విధానంలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించారు. జూన్ 2 నుంచి హైదరాబాద్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని తీర్మానించిన కేబినెట్ సౌర విద్యుత్ విధానానికి ఆమోదం తెలిపింది. ఉద్యాన విశ్వవిద్యాలయానికి అటవీశాఖ బదలాయింపునకు ఆమోదం తెలపడమేకాక ఆర్థికశాఖలో కొత్తగా 13 ఉద్యోగాలు సృష్టికి నిర్ణయించింది.