ఐదేళ్లకోసారి ఎన్నికలు
కాగజ్‌నగర్, (టీ మీడియా): దక్షిణ మధ్య రైల్వెలొ గర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రారంభమయాయి. గురువారం నుంచి శనివారం వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని రైల్వే కాలినిలో ఈమేరకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు . పోలింగ్ కేంద్రంలో రాళ్లపేట, సిర్పూరు కాగజ్‌నగర్, వేంపల్లి, సిర్పూరుటౌన్,మాకోడి రైల్వే స్టేషన్‌లో పనిచేసే 324 మంది సిబ్బంది, కార్మికులు ఓటు హాక్కు వినియోగించుకోన్నారు. గురువారం శ్రాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేలో కార్మిక సంఘలు గుర్తింపు కోసం ఐదెళ్లకొసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల వరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మాత్రమే పోటీపడుతుంది. ఈ సారి దక్షిణ మధ్య కార్మిక్ సంఘ్, రైల్వే మజ్దూర్ యూనియన్ కూడ పోటిపడుతుండగా , భారతీయ మజ్దూర్ సంఘ్ మద్దతు పలుకుతుంది. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రత్నం బందోబస్తు ఏర్పాటు చేశారు