ఐపీఎల్‌ను నిషేధించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
హైదరాబాద్ : బెట్టింగ్ , ఫిక్సింగ్ వూబిలో చిక్కుకున్న ఐపీఎల్‌ను తక్షణమే నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. దేశభక్తిని పెంపొందించాల్సిన క్రీడలు వ్యాపార లాభాల కోసం దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై బర్దన్ త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలుస్తారని ఆయన వెల్లడించారు.