ఐపీఎల్-లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6లో శనివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న పుణేకు ఈ మ్యాచ్ నామమాత్రం కాగా…. ముంబైకి మాత్రం కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో ముంబై మరింత ముందుకెళ్తుంది… ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లో పంజాబ్, హైదరాబాద్ ఢీకొనబోతున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన సన్‌రైసర్స్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ముందుకెళ్తుంది. ఇక పంజాబ్ కూడా ఈ మ్యాచ్ గెలిచిన ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.