ఐలమ్మకు కవిత నివాళి
నిజామాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి సందర్భంగా ఆమెకు గనంగా నివాళి అర్పించారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణెళిష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, రజక ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణెళిష్, రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దమ్మన్నస్వామి పాల్గొన్నారు.