ఐసిడిఎస్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు

ప్రతిఘటనా పోరాటాలకు సన్నద్ధం కావాలి

జనవరి 8న దేశవ్యాప్త సమ్మె

చంద్రబాబు, జగన్‌ పాలనకు తేడా లేదు

శ్రమ జీవులను ఐక్యం చేసే దిశగా అడుగులు

విజయవాడ,నవంబర్‌18  (జనం సాక్షి) : అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతిఘటనా పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌ పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఆయా కేంద్రాలను మెర్జ్‌ చేస్తుందని గమనించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలో భాగంగా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఎత్తివేసేలా ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐసిడిఎస్‌ వ్యవస్థ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇప్పటి వరకూ సాధించుకున్న హక్కులతోనే సరిపెట్టుకుందామని అనుకుంటే మన మనుగడనే కోల్పోయే ప్రమాదం పొంచివుందని ఆయన హెచ్చరించారు. రెండు దశబ్దాలుగా పోరాడి సాధించు కున్న హక్కులను కాలరాసేందుకు ప్రస్తుతం కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకూ చేసిన పోరాటాల ఫలితంగా కొంతమేరకు మన హక్కులను కాపాడుకోవడంలో అంగన్‌వాడీలు, హెల్పర్లు సఫలీకృతుల య్యారని అన్నారు. మనం పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం కావాలని చేస్తున్న పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర కార్మిక సంస్థ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం రైల్వే రంగాన్ని ప్రైవేటీకరిం చడం ద్వారా ఆ రంగాన్ని సామాన్యులకు దూరం చేసే ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపారు. తద్వారా ప్రస్తుతం రైల్వేరంగం ద్వారా ప్రజలకు అందుతున్న 42 శాతం రాయితీలను ఎత్తివేసేందుకు కుట్రలు సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆఖరికి దేశ రక్షణకు సంబంధించిన రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో అంగన్‌వాడీలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ జాతీయ కార్యదర్శి ఎకె సింధూ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ వ్యవస్థలో 28 లక్షల మంది ఉంటే మన సంఘంలో ఐదు లక్షలు మాత్రమే ఉన్నారని, మిగిలిన వారిని సంఘంతో కలిసివచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐసిడిఎస్‌ను పూర్తి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో అంగన్‌వాడీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాన్ని హత్య చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. సేవా రంగాన్ని సైతం నాశనం చేసే దిశగా కేందప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. లేకపోతే అంగన్‌వాడీ వ్యవస్థకు కూడా ప్రమాదం పొంచివుందని గ్రహించాలన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాల ఫలితంగానే గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని, అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సైతం అదే దిశగా అడుగులు వేస్తుందన్నారు. మూడు సంవత్సరాల సర్వీసు నిండిన యానిమేటర్లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీలను అదే కలం పోటుతో ఇంటికి సాగనంపడం కష్టమా అని ప్రశ్నించారు. మానవత్వాన్ని మరచిపోయి కార్మికుల జీవితాలను రోడ్లు పాలు చేసే ప్రయత్నాలను కలిసికట్టుగా తిప్పికొట్టకపోతే రోడ్డున పడటం తప్పదని ఆయన హెచ్చరించారు. ఐసిడిఎస్‌ను కాపాడుకోవడం మన కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. ఐదు కుటుంబాలు ఉన్నా ఐసిడిఎస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థ ద్వారానే అక్షరాస్యత పెరుగుతుందని, అటువంటి వ్యవస్థను నిర్మూలించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ఒఎన్‌జిసి, స్టీల్‌ ఎ/-లాంట్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న కుట్రల నేపథ్యంలో దేశ సంపదను కాపాడుకోవడం కోసం వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో అంగన్‌వాడీలు అగ్రభాగాన నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.