ఐసీపీఎస్‌లకు దరఖాస్తులు ఆహ్వానం
ఖమ్మం, నవంబర్ 27 (: జిల్లా మహిళ సాధికారత పిల్లల సంరక్షణ విభాగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. ఈ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒక పోస్టు, డేెటా ఎన్‌లిస్ట్ ఒకటి, డేెటా ఎంట్రీకాం అసిస్టెంట్ పోస్టులు మూడు, ఔట్ రీచ్ వర్కర్ ఒక పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ప్రత్యేక దత్తత స్వీకార సంస్థ మేనేజర్ కం కో-ఆర్డినేటర్ పోస్టు ఒకటి, సోషల్ వర్కర్ కం ఎడ్యుకేటర్ ఒకటి, పార్ట్ టైం డాక్టర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.