ఒంటరి మహిళల గుర్తింపు బాధ్యత మీదే..

ఒంటరి మహిళలను గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య. కానీ సదరు ఒంటరి మహిళ పెన్షన్ అందితే సంతోషిస్తుంది. ఆమెపై ఆధారపడిన వాళ్లు సంతోషిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించడం తేలిక. గ్రామంలో అడిగితే ఎవరైనా చెప్తారు. పట్టణ ప్రాంతాల్లో చాలా కష్టం. వారిని ఎలా గుర్తించాలన్న విచక్షణ అధికారం కలెక్టర్లకే వదిలేస్తున్నా. అయితే గుర్తింపు ప్రక్రియకు ఒక ప్రామాణికం ఉండాలి. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం భర్తను వదిలి ఉండే వారినిగుర్తించవచ్చు. నిరుపేదల్లో అలాంటి మహిళలకు ఆర్థిక సహాయం అవసరం. ఆధార్ కార్డు ఆధారంగా పెన్షన్లు జారీ చేయవచ్చు. అలాగే రాష్ట్రంలో అదనంగా 81వేల మంది బీడీ కార్మికులకు కూడా పెన్షన్‌లు ఇవ్వాలి. ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) గుర్తింపు కార్డుల ఆధారంగా వీరిని గుర్తించి ఈ స్కీమ్ అమలు చేయాలి