ఒంటెద్దు పోకడలతో పోతే పతనం తప్పదు

-ప్రతిపక్షాలను అణిచివేసినవారెవ్వరూ చరిత్రలో నిలువలేదు

-బడ్జెట్‌లో అప్పులను చూపించి ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

కరీంనగర్‌,ఏప్రిల్‌ 5(జ‌నంసాక్షి11-1434015159-cpi-leader-chada-venkat-reddy-666): ప్రపంచంలోనే మిగులు బడ్జెట్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగానా ఆని గొప్పలు చెప్పుకుంటుంటే నేడు కేసీఆర్‌ మాత్రం అందుకు బిన్నంగా 50వేల కోట్ల అప్పున్న రాష్ట్రంగా ఏకంగా బడ్జెట్‌లో చూపించి ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి., నగర కార్యదర్శి పైడిపల్లి రాజు,. ఎఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శిమణికంఠరెడ్డిలతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.  తెలంగాణా రాష్ట్రం వచ్చేవరకు అందరిని కలుపుకుపోయిన కేసీఆర్‌ వెలగతీశాడని నేడో రేపోకాంగ్రెస్‌ కూడా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తామనడం దారుణమన్నారు. ఆనాడే తుమ్మిడి హెట్టి వద్ద రిజర్వాయర్‌నిర్మాణం ప్రారంభించినా, తోటపల్లి రిజర్వాయర్‌ చేపట్టినా కూడా నేడు కేసీఆర్‌కు రద్దు చేసే అవకాశం ఉండేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తాము చేయకుండా ప్రతిపక్షంలోకి రాగానే ప్రశ్నిస్తాం విమర్శిస్తామంటే వినడానికి చూడ డానికి ప్రజలు అమాయకుల్లా కనిపిస్తున్నారా అన్నారు. ఇంతకాలం రాష్టాన్న్రి ఏలిన కాంగ్రెస్‌, టీడిపిలు చేసే సమయంలో చేయకుండా నేడు తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చి విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారనుకోవడం సరైంది కాదన్నారు. సిపిఐ మండుతున్న వేసవి వేడి మిని తట్టుకునేందుకుగాను పేదలకు అంబలికేంద్రాలను గ్రామగ్రామాన దశాబ్దాలుగా నిర్వహించిందని, ఇటీవలకేవలం హైదరాబాద్‌ అసెం బ్లీలో ఏర్పాటుచేసుకుని ఎమ్మెల్యేలకు ఏర్పాటుచేసి ప్రజలను ప్రక్కన పెట్టడం సరైంది కాదన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కూడా వెంటనే ప్రతి గ్రామంలో కూడా అంబలి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రాష్ట్రం అంతా కరువు ఉంటే ఉపాది పనులు నగర పంచాయితీలకు లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. నగర పంచాయితీలకు కూడా ఉపాది పనులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 20న చలో సెక్రటేరియట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

9,10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

సిపిఐ రాష్ట్రంలో నెలకోన్న కరువు పరిస్థితులు, తదితర అంశాలపైన, ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దుందుడుకు వ్యవహారంపై కూలంక షంగా చర్చించి పోరాటాలు సిద్దం చేసేందుకుగాను ఈనెల 9. 10 తేదీల్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తు న్నామని చాడవెంకటరెడ్డి వెల్లడించారు. కరువుప్రాంతాలు అల్లాడుతున్నా కూడా తాగునీటిపై నిబందనలు అమలు చేయడం,. ఉపాదిహామి పనులు చేపట్టకపోవడం తదితర అంశాలతోపాటు ప్రాజెక్టులనిర్మానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఈసమావేశాలను వేదికగా మార్చుకుంటున్నామన్నారు.