ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం ….

-కొడిమాల శ్రీనివాసరావు ,బ్లడ్ మోటివేటర్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి)
 జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం ఏవివి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన ర్యాలీ కళాశాల నుండి ఎంజమ్ సర్కిల్ వరకు 11 ఫీట్ల రక్త బిందువుతో వినూత్నంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ భూజoదర్ రెడ్డి ర్యాలీని ప్రారంభిస్తూ నేటి యువత కు రక్తదానంపై అవగాహన ఎంతో అవసరమని దీని కొరకై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏవివి ఎప్పుడు ముందుంటుందని అన్నారు, అలాగే 48 వి ఈ మరియు బ్లడ్ మోటివేటర్ కొడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మనకు వరంగల్లో 25 వేల నుండి 30 వేల యూనిట్ల రక్తం అవసరం ఉందని కానీ 25 నుంచి 26,000 మంది మాత్రమే రక్తదానం  చేస్తున్నారని కావున 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు 45 కిలోల మరియు ఆరోగ్యవంతమైన వారు రక్తదానం చేసినందుకు అర్హులని వీరు మన నగరంలో కనీసం ఒక లక్ష మంది ఉన్నారని సంవత్సరానికి ఒకసారి ఇచ్చిన ఎంతో మందిని ప్రాణాపాయం నుండి కాపాడిన వాళ్ళు అవుతామని “రక్త దానము ఒక మహా దానమని” దీనివల్ల మనం ఆరోగ్యంగా ,ఉత్సాహంగా, సంతృప్తిగా ఉంటామని అన్నారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహలను, అనుమానాలను తొలగించి రక్తదానం చేసే విధంగా ప్రతి వాలంటరు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ అనిత   , సీనియర్ వాలంటీర్లు సమీర్ ,నాగేష్, కార్తికేయ , నవ్య సదా ఉమేరా, నవదీప్, శివరాజ్  మొదలగు వారు పాల్గొన్నారు.
Attachments area