ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కలకలం రేగింది. రింగ్ రోడ్ పక్కన వేర్వేరు స్థలాల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో ఇద్దరు యువతులు, ఓ మహిళ , సర్విస్ రోడ్డు పై ఓ కారులో తండ్రీ కొడుకుల డెడ్ బాడీలు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని హత్య చేశారా.. లేదంటా ఆత్మహత్యచేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతదేహాలు లభ్యమైన కారు వేముల లక్ష్మీనారాయణ పేరుపై రిజిస్ట్రరై ఉంది.