ఒకే గొడుకు కిందకు విద్యాలయాలు

C

– మానవ వనరులు మరింత బలోపేతం

– విద్యారంగ బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి 23(జనంసాక్షి): ఆర్థిక స్థోమత లేని పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు విద్య బాధ్యత ప్రభుత్వానిదేనని  సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం విద్యాశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయన సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘విద్య కోసం ఏటా రూ.20వేల కోట్లకుపైగా ఖర్చవుతున్నా ఫలితాలు రావటం లేదన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఆర్థికస్థోమత కలిగిన వారి పిల్లలు మంచి స్కూళ్లలో చదువుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధత్యని అన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం పెట్టిన ఖర్చు బావితరాలకు ఉపయోగపడుతుంది. మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుంది. విద్య కోసం ప్రతీ ఏడాది రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాలు రావడంలేదు. పేద విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి ఉన్నతస్థాయి చదువులు చదువుకోవడానికి అనుగుణంగా విద్యా విధానం ఉండాలి. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చాలి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలి.  సంక్షేమశాఖ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చాలి. పేద విద్యార్థులు ఎల్‌కేజీ నుంచి ఉన్నత చదువులు చదివేలా విద్యా విధానం ఉండాలి. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలి. ప్రభుత్వ విద్యా సంస్థలపై విధాన రూపకల్పనకు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కావాలి. పాఠశాలల్లో పరిశుభ్రత, మంచినీటిపై పంచాయతీలను బాధ్యులను చేస్తూ చట్టం చేస్తాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా స్థిరీకరించాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థను వచ్చే ఏడాది కొనసాగిస్తూ బలోపేతం చేయాలి. పురాతత్వ విభాగం, గంథ్రాలను సాంస్కృతికశాఖలకు, ఐటీఐను కార్మికశాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖలకు బదిలీ చేయాలి’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  విద్యాశాఖ సమర్పించిన బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవిూక్ష నిర్వహించారు. ఇవాళ జరిపిన ఈ సమావేశంలో

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  విద్యాశాఖలో 14 విభాగాలు ఉన్నాయి. అవసరంలేని విభాగాలను తొలగించాలి. ఆర్కైవ్‌, గ్రంథాలయాల విభాగాలకు కల్చరల్‌ శాఖకు అప్పగించాలని సిఎం సూచించారు.

అన్ని భాషల అకాడవిూలను ఒకే అకాడవిూగా మార్చాలి. అన్ని రకాల విద్యలను విద్యాశాఖ పరిధిలోకి తేవాలి. ఐటీఐని కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకు బదిలీ చేయాలి. ఏపీ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అవసరంలేని పథకాలను తొలగించాలి. యూనివర్సిటీలంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు యూనివర్సిటీల పరిస్థితి గందరగోళంగా మారింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, హయ్యర ఎడ్యుకేషన్‌, యూనివర్సిటీ విద్య, వివిధ సొసైటీల ద్వారా నడుస్తోన్న విద్యా సంస్థల సమగ్ర సమాచారం ఒకే దగ్గర ఉండాలి. ఎన్ని విద్యా సంస్థలున్నాయి, వసతులు ఉన్నాయి, విద్యార్థులెంతమంది ఉన్నారు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకా ఏమైనా నియామకాలు అవసరమా తదితర విషయాలపై పూర్తిగా అధ్యయనం చేయాలి అని అన్నారు.

నాలుగు జిల్లాల్లో రహదారులకు నిధులు విడుదల

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో రహదారుల విస్తరణకు మంగళవారం పంచాయతీరాజ్‌శాఖ నిధులు విడుదల చేసింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రహదారుల విస్తరణ చేపట్టనున్నారు. 2,053 రహదారుల స్థాయి పెంపునకు రూ.111.20 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.