ఒకే తల రెండు దేహాలు

డోర్నకల్ అక్టోబర్ 9 జనం సాక్షి

మహబూబాబాద్ జిల్లా ఓ పట్టణంలో వింత గొర్రె పిల్ల జన్మించిన కొద్దిసేపటికి మరణించింది.ఈ ఘటన డోర్నకల్ పట్టణంలోని యాదవ్ నగర్ లో చోటు చేసుకుంది.కేశబోయిన లింగస్వామి అనే రైతుకు చెందిన గొర్రె ఆదివారం ఉదయం రెండు గొర్రె పిల్లల దేహాలు ఓకే తలతో జన్మించడంతో చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చి వింతను తిలకించారు.కొద్దిసేపటికి ఆ గొర్రె పిల్ల మరణించినట్లు రైతు తెలిపారు.