ఒకే నంబర్‌తో ముగ్గురికి హాల్‌టిక్కెట్లు

వరంగల్‌ : ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణంగా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.