ఒక్క అవకాశం ఇవ్వండి…

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని  ఎక్కుపెట్టారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ పై  ఆయన మంగళవారం   ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.  ఇప్పటికైనా  ఢిల్లీ పోలీసు, ఏసీబీ పై తమకు అధికారాలను అప్పగించాలని కేజ్రీవాల్ కోరారు.  అవినీతిని అరికట్టడంలో కేంద్రానికి నిజాయితీ ఉంటే  తమకు  పూర్తి అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే  ఒకే ఒక్క  సంవత్సరంలో  తమ సత్తా నిరూపిస్తామంటూ కేజ్రీవాల్  ట్విట్ చేశారు.

ఇటీవల  సీఎంఎస్  సర్వే ఆశ్చర్యపోయే భయంకరమైన  వాస్తవాలు బయటపడ్డాయంటూ   వ్యాఖ్యానించిన ఆయన ఢిల్లీ పోలీసు వ్యవస్థపై పట్టుకోసం  వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ప్రయత్ని స్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ లో  ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ పై  విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా పట్టువీడండి.. మాతో కలిసి పనిచేయండి, మా ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వండి.. ఒక్క సంవత్సరంలో పోలీస్ వ్యవస్తను ప్రక్షాళన చేసి చూపిస్తానంటూ కేజ్రీవాల్ ట్విట్ చేశారు.

కాగా ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సిఎంఎస్‌) సంయుక్తంగా  నిర్వహించిన సర్వేలో   ఢిల్లీ  పోలీసు వ్యవస్థలోని భారీ అవినీతి జరిగినట్టు తేలింది. ఈ ఏడాది జులై ఆగస్టు  నెలలో నిర్వహించిన సర్వే ఫలితాలపై ఆయన పై విధంగా స్పందించారు.