ఒక్క అవకాశం ఇవ్వండి..మీ రుణం తీర్చుకుంటా..!

ఒక్క అవకాశం ఇవ్వండి..మీ రుణం తీర్చుకుంటా..!

జనం సాక్షి భువనగిరి (నవంబర్ 09 )ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన భువనగిరి నియోజకవర్గం లోని ప్రతి పల్లె నా సొంత ఊరేనని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి…మీ రుణం తీర్చుకుంటా.. భువనగిరిని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బుధవారం వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీతో ఎమ్మెల్యేగా ఆయన నామినేషన్ అనంతరం జరిగిన మీడియా మీడియా సమావేశంలో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గ ప్రజలతో తనది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదని కుటుంబ బంధమని అన్నారు.తనను గెలిపిస్తే అన్ని వేళలా అందు బాటులో ఉండి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తెలిసి న తాను అన్ని వేళలో మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి కి తన శాయ శక్తుల కృషి చేస్తానన్నారు.నియో జకవర్గ సమస్యలపై ఏమాత్రం అవగాహనలేని స్థానికేతర వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ఇప్పటికే గత తొమ్మిదిన్నర ఏళ్లుగా భువనగిరి నియోజ కవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అనిల్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణమే అభివృద్ధి అనే భ్రమలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడని ఆయన విమర్శించారు.అన్ని జిల్లా కేంద్రాల్లాగే భువనగిరి జిల్లా కేంద్రం ఎందుకు అభివృద్ధి సాధించలేదని అనిల్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓట్ల కోసం మీ వద్దకు వచ్చే టిఆర్ఎస్ నేతలను అభివృద్ధిపై నిలదీ యాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నియో జకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి నాంది భువనగిరి నుంచే ప్రారంభం కావా లని భువనగిరి నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. “మీరు వేసే ఓటు కేసీఆర్, పైళ్ళ శేఖర్ రెడ్డి కుటుంబం బాగుపడ డానికి వేస్తారా లేక మీ కుటుంబం బాగుపడ డానికి వేస్తారా గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ కుటుంబానికి, మీ పిల్లల భవిష్యత్తుకు వేసినట్లు’అని అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ ప్రజలను వేడుకున్నా రు. భువనగిరి..ప్రజలు అంగట్లో పశువులు అనుకుంటున్నారని, డబ్బులిస్తే ఓట్లు వేస్తారని భావిస్తున్నారని, కానీ భువనగిరి ప్రజలు పులి బిడ్డలని అన్నారు.బిఆర్ఎస్, బిజెపి నేతలు కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాల నుకుంటున్నారని,ఆలాంటి పార్టీలకు ప్రజలు తమ ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.బిఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలు నమ్మి మరోసారి పోవద్దని కుంభం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఫీజు రీయంబర్స్ మెంట్ తో విద్యను అందించిందని,ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఉండేందుకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని గుర్తు చేశారు.ఒకసారి ఓడినా కూడా లెక్కచేయకుం డా నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ ప్రాంత సమస్యల పై పోరాటం చేస్తున్న తనకు ఒక అవకాశం ఇచ్చి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్య క్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయ ణరెడ్డి,పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమా ర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పీసీసీ డెలి గేట్ తంగళ్ళపల్లి రవికుమార్,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి ఆవేజ్ చిస్థీ, డిసిసి కార్యదర్శి ఎండి మజాహర్,మైనార్టీ నాయకుడు ఎండి సలావుద్దీన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.