ఒడిదుడుకుల్లో బీడీపరిశ్రమ

నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న బీడీ కార్మికుల బతుకులు ఆందోళన స్థితిలో ఉన్నాయని బీడీ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల పొట్టకొట్టడానికే జీఎస్‌టీ పన్ను విధిస్తోందని మండిపడ్డారు. దీంతో తమ బతుకు బుగ్గి పాలయ్యాయని అన్నారు. అంతిమంగా ఇది కార్మికులపై ప్రభావం చూపుతోందని అన్నారు. బీడీపరిశ్రమను దెబ్బతీయడం ద్వారా ఎందరో మహిళలకు ఉపాధి దక్కకుండడా అయ్యిందన్నారు. ఇప్పటికే నెలలో పదిహేను రోజులు కార్మికులకు పని లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. జీఎస్టీతోతో బీడీ కంపెనీలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం జీఎస్టీ నుంచి బీడీలపై విధించే పన్నును మినహాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్చించాలని అన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.