ఒబామా నవ్వుల ‘విందు’

1national2bఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా…సరదాగా జోక్ లు వేశారు. ఎవ్వరినీ వదలేదు. తనతో పాటు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతన్న డొనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ లపైన జోకులు వేసి అందరినీ నవ్వించారు. ఈ ఏడాది చివరిలో ఒబామా పదివీకాలం ముగియనుంది. ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుని గా ఉన్న ఆయన…చివరిసారిగా వైట్ హౌజ్‌ లో వివిధ రంగాల వారికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఒబామా గతంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. తనపై తాను జోక్‌ లు వేసుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నేనొక యువకుని గా ఉన్నాను. ఆదర్శవాదం, ఉత్సుకత నాలో అణువణువునా నిండివుండేవి. కానీ ఇప్పుడు తన జుట్టు నెరసిపోయిందని జోక్‌ వేశారు.

ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంలో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌ పై ఒబామా పంచులు పేల్చారు. ట్రంప్‌ కు విదేశాంగ విధానంపై అవగాహన లేదని ఆయన పార్టీ వాళ్లే చెబుతున్నారని గుర్తు చేశారు. ఐతే ట్రంప్‌ కు మిస్‌ స్వీడన్‌, మిస్‌ అర్జెంటీనా, మిస్‌ అజర్‌బైజాన్‌లతో వ్యవహరించిన అనుభవం ఉందంటూ సెటైర్ వేశారు. ట్రంప్ విందుకు హాజరు కాకపోవటంపైన ఒబామా జోకులు వేశారు. మనమంతా సంతోషంగా గడుపుతుంటే…ట్రంప్‌ మాత్రం ఇంటిలో కూర్చొని ఏంజెలా మెర్కెల్‌ ను అవమానించేందుకు ట్వీట్లు సిద్ధం చేస్తూ ఉండవచ్చని చెప్పారు.

హిల్లరీ క్లింటన్‌ ను ఒబామా వదలలేదు. ఆమెను ఆంటీ అని పిలిచారు. ఐతే పరోక్షంగా హిల్లరీయే డెమెక్రాట్ల అధ్యక్ష అభ్యర్థని చెప్పారు. అటు పలు అంశాలపై ఒబామా స్పందించారు. పత్రికా స్వేచ్ఛ పై దాడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఈ విందులో పాల్గొన్నారు.