ఒబామా, రోమ్నీల హోరా హోరీ

సర్వేకు చిక్కని ఓటరు నాడి
నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి):
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అభ్యర్థి మిట్‌ రోమ్నిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓటరు నాడీ మాత్రం ఏ సర్వేకు చిక్కలేదు. ఈ ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చే అవాకాశం ఉన్నట్టు అనేక సర్వేలు వేల్లడిస్తుండాగా, మరికొన్నొ సర్వేలు మాత్రం.. బరాక్‌ ఒబామాదే పైచేయిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఎన్నికలపై తాజగా వాషింగ్టన్‌ పోస్ట్‌ ఏబీసీ న్యూస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఒబమాకు 49 శాతం, రోమ్నికి 48 శాతం ఓట్లు రావొచ్చంటూ వెల్లడించాయి. అయితే, అనేక మంది ఓటర్లు ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నారని, వారి మనస్సు చివరి క్షణంలో ఎలా మారుతుందో చెప్పలేమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదిలావుండాగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా మాత్రం చివరి నిమిషం వరకూ ప్రచారంలోనే నిమాగ్నమైనారు వర్జినియాలో జరిగిన ప్రచారంలో అయిన మాట్లాడుతూ తనకు మరోసారి అధికారం అప్పగిస్తే దేశాన్ని అర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా గట్టెక్కిస్తానంటూ హామీ ఇచ్చారు. అలగే కొలరాడోస్రింగ్‌ ప్రచారంలో పాల్గ్గొన్న మిల్‌ రోమ్ని ప్రస్తుత అధ్యక్ష పాలనపై విమర్శలు గుప్పించారు.

తాజావార్తలు