ఒబామా-రోమ్నీ మధ్య హోరాహోరీ

అమెరికా: నవంబర్‌ 6, (జనంసాక్షి):

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే టైముంది అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒబామాకా లేక రోమ్నీకా ప్రెసిడెంట్‌ అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా సేనా అన్నట్టు పోటీ ఉండంతో లమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరనేది అంచనాలకు అందడం లేదు దీంతో యూఎస్‌ ఓటర్లలో గంట గంటకూ ఉత్కంఠ పెరుగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి, పోలింగ్‌ సమయం దగ్గరపడుతోంది దీంతో ఒబామా,రోమ్నీ మరింత జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు, అయితే వీరిద్దరిలో ఎవరిని గెలుపు వరిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, సర్వేలు మత్రం ఒబామాదే పైచేయి అంటున్నాయి అది కూడా కొద్ది పాటి తేడాతో ఈ బ్లాక్‌ డైమండ్‌ విజయంసాధించడం ఖాయమంటున్నాయి.  అయితే చాలా మంది ఓటర్లు ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని వారి మనస్సు చివరి క్షణంలో ఎలా మారుతుందో చెప్పలేమంటున్నాయి సర్వేలు.శాండీ తుఫాన్‌ ప్రభావం అధ్యక్ష ఉన్నికల పోలింగ్‌ పైనా ప్రభావం చూపుతోంది కొన్ని ప్రాంతాల్లోఅధికారులు ఓటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే అవకాశంలేని వారు ఫ్యాక్స్‌ ఈమెయిల్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పించారు, కొన్ని చోట్ల మిలటరీ వాహనాలనే పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఇదే అదనుగా పబ్లిసిటీ కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి,పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో ఒబామాకు ఓటేస్తే చాక్లెట్‌ ఫ్రీ అంటూ ఆఫర్ల గాలం వేస్తున్నాయి .ఇక రోమ్నీ ఒబామా మద్దతుదారులు తమ అభిమాన నాయకులను గెలిపించేందుకు ఇంటింటికి వెళ్లి తమ పార్టీకి ఓటియాలని కోరుతున్నారు. కీలక సమయంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ప్రపంచ దేశాల్లోని నాన్‌ అమెరికన్లు కూడా ఒబామా వైపే మొగ్గుచూపుతున్నారు ,,,,,,, సంస్థ 36 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 81శాతం మంది ఒబామాను బలపర్చగా మిట్‌ రోమ్నీని 19 శాతం మంది అండగా నిలిచారు ఆశ్చర్యమేమంటే చైనాలో 52 శాతం మంది మిట్‌ రోమ్నీకి సమర్థించారు ఇక బ్రిటన్‌లో ఒబామాకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది అక్కడ 85 శాతం మంది ఒబామానే మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావాలని ఆకాంక్షించారు.