ఒమిక్రాన్ వేరియంట్‌పై అనవసర భయాలు
దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు
అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే
న్యూఢల్లీి,డిసెంబర్20(జనం సాక్షి): అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిసోంది. ఈ వేరియంట్ కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో వెగులుచూసిన ఈ రెండు కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 145కు పెరిగాయి. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తి సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు అధికారుల వెల్లడిరచారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. కాగా, కేంద్రం, రాష్టాల్ర గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్టాల్రు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు నమోదుకాగా, ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఢల్లీిలో 22, తెలంగాణ 20, రాజస్థాన్ 17, కర్నాటక 14, కేరళ 11, గుజరాత్ 9, ఆంధప్రదేశ్, చంఢగీఢ్, తమిళనాడు, బెంగాల్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకున్నారని అధికారులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరమైనదే అయినా జాగ్రత్తలు ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒమైక్రాన్ రాకతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. మళ్లీ కరోనా సీజన్ మొదలైందనిపిస్తోంది. అక్టోబర్, నవంబర్‌లో సెకండ్ వేవ్ కేసులు గణనీయంగా తగ్గాయి. పండగల సీజన్ కావటంతో సహజంగానే థర్డ్ వేవ్ అవకాశాలు ఎక్కువ. కానీ అలా జరగలేదు. పైగా, కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. వారం రోజుల సగటు ఏడు వేలకు దిగవకు పడివటం దానికి సూచన. మరోవైపు, వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతమైంది. ఇవన్నీ చూసి మనం థర్డ్ వేవ్ ముప్పు
నుంచి బయటపడ్డామా అని అనిపించింది.
దాని గురించి అప్పుడే అతిగా భయపడటం మంచిది కాదని, మాస్కులు ధరించి ఎదుర్కోవచ్చని అంటున్నారు. దాని తీవ్రతపై ఇంకా శాస్త్రీయ స్పష్టత రాకపోవడంతో పాటు.. లక్షణాలను నిర్థారించాల్సి వుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు. మరో రెండు వారాలలో కొత్త వేరియంట్‌పై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఒమైక్రాన్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి. డెల్టా కన్నా చాలా వేగంగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్లు కూడా దీని ముందు పనిచేయవని..ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ నిరాధారమైన వార్తలే. శాస్త్రవేత్తలకే ఇంకా దీని గురించి పూర్తిగా తెలియదు. సోషల్ విూడియాలో మాత్రం అంతా వైరాలజిస్టుల్లా మాట్లాడుతున్నారు. ఒమైక్రాన్ ఎంతదూరం వెళుతుందో చూడాల్సి వుంది. మరోవైపు, జనం కరోనా గురించి పట్టించుకోవటమే మానేశారు. ముఖానికి మాస్కులు ధరించే వారు తక్కువయ్యారు. భౌతిక దూరం అనేది కనిపించట్లేదు. పండుగలు..శుభకార్యాలలో గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు. గత పక్షం రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడటటంతో కథ మొదటికి వచ్చింది. మరోసారి థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. సాధారణంగా ఒక వేరియంట్ మొదటి కేసు వెలుగు చూసిన మూడు వారాలలో అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఒమైక్రాన్ ఇప్పటికే 38 దేశాలకు పాకింది. అత్యధిక మ్యుటేషన్లు కలిగిన ఈ వేరియంట్‌పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఐతే, ప్రపంచ ఆరోగ్యం సంస్థ మాత్రం ఇది ప్రమాదకరమైన వేరియంట్ అని మాత్రం ప్రకటించింది. అంతకు మించి దీని లక్షణాలపై ఏ అధికారిక ప్రకటన లేదు. మనం రెండు సార్లు కరోనాను ఎదుర్కొన్నాం. మొదటి సారి అత్యంత పగడ్బంధీగా మహమ్మారిని కట్టడిచేశాం. కానీ, సెకండ్ వేవ్‌లో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. మహమ్మారి పునరాగమనం విషయంలో సంసిద్ధత కొరవడిరది. పాలకుల అతి విశ్వాసానికి సామాన్యులు బలయ్యారు. కానీ, ఒమైక్రాన్ విషయంలో అలా జరగకపోవచ్చు. ఎందుకంటే, కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు కనిపి స్తోంది. గత అనుభవం రీత్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. డెల్టా వేరియంట్ వల్ల చాలా మందిలో రోగనిరోధకశక్తి వృద్ధి అయింది. దీనివల్ల ఒమిక్రాన్ తీవ్రత దేశంలో తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఒమైక్రాన్ కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాగే ఈ వేరియంట్ తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంటోంది. భారత్ సహా ఇప్పటి వరకు 38 దేశాలలో ఒమైక్రాన్ ఉనికి బయటపడిరది. ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే మనం థర్డ్ వేవ్‌ను కొట్టిపారేయటం తెలివితక్కువతనమే అవుతోంది. కాబట్టి టీకాల విషయంలో అనుమానాలు వీడాలి. అవి ఒమిక్రాన్‌పై పనిచేయవు అనడానికి ఆధారాలు లేవు. దీని వ్యాప్తి, మ్యూటేషన్లను బట్టి దీనిని ఆందోళన కలిగించే వాటి జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది. కాబట్టి దీని పట్ల అశ్రద్ధ పనికిరాదు..బాధ్యతారాహిత్యం అంతకన్నా మంచిది కాదు. కొవిడ్ నియమాలు పాటిస్తే ముప్పు నుంచి బయటపడవచ్చని భారత ప్రభుత్వం చెపుతోంది. కాబట్టి ఒమైక్రాన్ విషయంలో భయాలు వీడి జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.