ఒలింపిక్స్‌లో హైద్రాబాదీ సైనాకు కాంస్యం

లండన్‌: హైద్రాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.శనివారం జీన్‌వాంగ్‌తో కాంస్యంకోసం జరిగిన పోరులోవిజయం సాధించి ంది. ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైన సైనా శనివారం జీన్‌వాంగ్‌తో జరిగిన పోరు లో ఆమె విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. మొదటి గేమ్‌ను 21-18తో గెలి చిన జీన్‌వాంగ్‌ గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో సైనా విజేతగా నిలిచింది.జీన్‌ వాంగ్‌ను వైద్యులు పరీక్షించి ఎడమకాలికి దెబ్బ తగిలినట్లు నిర్దారించారు. టాప్‌ సీడ్‌ ఇహాన్‌ వాంగ్‌ తో శుక్రవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్‌లో ఐదో ర్యాంకర్‌ సైనా 13-21,13-21తో వరుస గేముల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సైనా మరోమారు చైనా అడ్డుగోడను దాటలేకపోయింది. రెండో సెమీస్‌లో లీ జుయెరీ చేతిలో ఓటమి పాలైన ప్రపంచ రెండో ర్యాంకర్‌ జిన్‌ వాంగ్‌తో సైనా కాంప్యం కోసం పోరాడింది. కాగా సైనా పట్ల విజయం పట్ల ఆమె తండ్రి హరివీర్‌ సింగ్‌ హర్షం వ్యకం చేశారు. సైనా తప్పకుండా పతకం తెస్తానని చెప్పిందని, నిజానికి స్వర్ణం సాధిస్తుందని ఆశించామని తెలిపారు. దేవుడి దయ వల్ల పైనా పతకం సాధించిందని ఆయన అన్నారు. తొలిసారి ఒలంపిక్‌ సెమీనలో అడుగుపెట్టిన భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సైనా ప్రపంచ నెంబర్‌వన్‌ వాంగ్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 42 నిమిషాల్లోనే ముగిసిన ముగిసిన పోరులో ప్రేక్షకులు ఆద్యతం సైనా..సైనా..అంటూ మద్దతుగా నిలిచారు. అయితే పొడగరి అయిన, ప్రపంచ ఫస్ట్‌ ర్యాంకర్‌ ఇహాన్‌ వాంగ్‌ అద్భుత ప్రదర్శనతో సైనాను ఓడించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ఫస్ట్‌ సెట్‌ గెలిచిన జీన్‌ వాంగ్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో వాక్‌ఓవర్‌తో సైనా కాంస్య పతకం సాధించింది. ఇదిలా ఉండగా సైనా విజయం పట్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సైనా విజయం దేశానికి గర్వకారణమన్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.