అసదుద్దీన్ఒవైసీ కారు పై ఆగంతకులు కాల్పులు
ఢిల్లీ: మీరట్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ)పై ఆగంతకులు కాల్పులు జరిపారు. గురువారం యూపీలోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై ఆగంతకులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అసద్ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరొక వాహనంలో ఢిల్లీ బయలుదేరారు. ఓవైసీ అనుచరులు ఓ దుండగుడిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని నోయిడా స్థానికుడిగా గుర్తించారు.