ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 9 నియోజక వర్గాలలోని బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ఓటరు జాబితాలను పరిశీలించారని, ఓటర్లందరూ పరిశీలించుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తు శుక్రవారం తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ముసాయిదా జాబితాను జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో తయారు చేశామన్నారు. 01-01-2013 నాటికి 18 సంవత్సరాలు నిండి వారి పేర్లు సదరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కానట్లయితే వారు ఫారం-6, క్లేయిములను అక్టోబరు 31లోగా దాఖలు చేసుకోవాలని అన్నారు. వీరందరూ బూత్‌స్థాయి అధికారి, సంబంధిత తహశీల్దార్‌ కార్యాలయంలో, రెవెన్యూ డివిజన్‌, పోస్టాఫీసు, ఇ-సేవా కేంద్రంలో గానీ, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే అనర్హులైన వారి పేర్లు ముసాయిదా జాబితాలో నమోదు  అయ్యి ఉంటే వారి పేర్లను తొలగించుటకు ఫారం-7 క్లేయిములను , సవరణ గురించి ఫారం-8, 8ఎల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చానన్నారు. ప్రతి గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వారికి తప్పని సరిగా ఓటరు జాబితాకి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

తాజావార్తలు